: యూపీలో 87 మంది బీజేపీ నేతలపై వేటు!
ఉత్తరప్రదేశ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ తన దైన శైలిలో పాలన సాగిస్తున్నతరుణంలో, మరోపక్క బీజేపీ తాజాగా తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. ఆ పార్టీకి చెందిన 87 మంది నేతలపై వేటు వేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కని పలువురు నేతలు పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కొందరు నేతలైతే ఏకంగా ప్రతిపక్ష పార్టీకి మద్దతుగా నిలిచారు.
ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యలు తీసుకున్న బీజేపీ, 87 మంది నేతలపై వేటు వేసింది. పార్టీలో సమూల మార్పులు తీసుకువచ్చే నిమిత్తం యోగి ఆదిత్యనాథ్ సూచన మేరకే బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, వేటు పడిన నేతల్లో కపిల్ దేవ్ కొరి, వీకే షైనీ, ఇంద్రదేవ్ సింగ్, శాంతి స్వరూప్ శర్మ తదితరులు ఉన్నారు.