: ‘ఆనందం’లో వృద్ధులకు ‘బాహుబలి-2’ ఉచిత ప్రదర్శన!
‘బాహుబలి-2’ సినిమా చూడాలని పిల్లలు, పెద్దలు ఎంతగా ఆసక్తి చూపుతున్నారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ జాబితాలో తాజాగా, వృద్ధులు కూడా చేరారు. చెన్నైలోని ‘ఆనందం’ వృద్ధాశ్రమంలోని సుమారు 101 మంది వృద్ధులు ‘బాహుబలి-2’ చిత్రాన్ని చూడాలనే ఆసక్తిని చూపారు.
ఈ విషయం ఓ యువజన సామాజిక స్వచ్ఛంద సంస్థకు తెలిసింది. దీంతో, ఈ చిత్రాన్ని వారికి చూపించేందుకు ముందుకొచ్చింది. ‘మదర్స్ డే’ కానుకగా ఈ చిత్రాన్ని వారికి చూపించాలని నిర్ణయించింది. ఈ నెల 13న అంబత్తూరులోని రాఖీ సినిమాస్ థియేటరులో ‘స్పెషల్ షో’ ఏర్పాటు చేసింది. ఇక, ఈ స్పెషల్ షో బాధ్యతలను ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సోదరి రెహానా స్వీకరించారు. కాగా, భారత్ లో ‘మదర్స్ డే’ ప్రతి ఏటా మేలో రెండో ఆదివారం నాడు నిర్వహిస్తుంటారు.