: దేశం దాటిపోయిన జస్టిస్ కర్ణన్?


పశ్చిమబెంగాల్ పోలీసులకు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కర్ణన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన ఆచూకీ మాత్రం దొరకడం లేదు. మరోవైపు కర్ణన్ దేశాన్ని విడిచి వెళ్లిపోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణన్ దేశం వదిలి వెళ్లి పోయి ఉంటారని ఆయన సన్నిహితుడు, న్యాయ సలహాదారు పీటర్ రమేష్ కుమార్ చెప్పారు. రోడ్డు మార్గం గుండా బంగ్లాదేశ్ లేదా నేపాల్ కు వెళ్లి ఉండవచ్చని తెలిపారు. తనకు న్యాయం జరగాలని కర్ణన్ కోరుకుంటున్నారని... హైకోర్టు జడ్జిగా మళ్లీ ఆయనను రాష్ట్రపతి నియమించిన తర్వాతే తిరిగి వస్తారని చెప్పారు.

కోర్టు ధిక్కారం కేసులో జస్టిస్ కర్ణన్ కు సుప్రీంకోర్టు ఆరు నెలల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. తమ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని... కర్ణన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని పశ్చిమబెంగాల్ పోలీసులను ఆదేశించింది. 

  • Loading...

More Telugu News