: ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని నిరూపించాం.. ఇక బ్యాలెట్ పేపర్లు వాడండి: ఆప్ డిమాండ్


ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చనే విషయాన్ని ఢిల్లీ అసెంబ్లీలో నిరూపించామని... ఈ నేపథ్యంలో, ఈవీఎంలను పక్కనబెట్టి మళ్లీ బ్యాలెట్ పేపర్ల విధానంలోనే ఎన్నికలను నిర్వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఎదుట ఈ రోజు ఆప్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలక్షన్ కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News