: 'బార్ అండ్ రెస్టారెంట్' వ్యాపారంలోకి దిగిన క్రిస్ గేల్
ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని దేశాల క్రికెట్ లీగ్ పోటీల్లో కనిపించే పరిచయం అక్కర్లేని వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ మద్యం వ్యాపారంలోకి దిగాడు. గత కొన్నేళ్లలో తానాడిన లీగ్ పోటీలు, వ్యాపార ప్రకటనల ద్వారా కోట్ల రూపాయల ఆదాయాన్ని వెనకేసుకున్న ఆయన, తాజాగా 'ట్రిపుల్ సెంచరీ 333' పేరిట జమైకాలో ఓ బార్ అండ్ రెస్టారెంట్ ను ప్రారంభించినట్టు తెలిపాడు. తన సంపాదనలో కొంత విలాసాలకు ఖర్చు పెడుతూనే, వ్యాపారాలు సైతం చేస్తున్నానని, కొన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ కూడా చేశానని ఈ సందర్భంగా క్రిస్ గేల్ వ్యాఖ్యానించాడు. పెట్టే పెట్టుబడిలో లాభమైనా, నష్టమైనా రావచ్చని వేదాంతం చెప్పిన గేల్, ఐపీఎల్ లో ఆడటానికి ముందే ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు.