: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగలేఖ


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లేఖలో ఆయన పేర్కొన్నారు. గిట్టుబాటు ధర అడిగిన రైతులపై రాజద్రోహం కేసులను పెట్టడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రానికి వెన్నెముక అయిన రైతులకు దొంగల్లా బేడీలు వేయడం ఏమిటని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా ఇంత దారుణానికి అప్పటి ప్రభుత్వాలు పాల్పడలేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. 

  • Loading...

More Telugu News