: ఆన్ లైన్ లో ఛాటింగ్ చేసి ప్రేమలో పడింది... అతను ఎదురుగా వస్తే షాక్ కు గురైంది: సోషల్ మీడియా ప్రేమాయణం


సోషల్ మీడియా సంబంధాలు ఎలా ఉంటాయో తెలుపుతూ ప్రియ అనే మహిళ తన జీవితంలో చోటుచేసుకున్న ఘటన గురించి ట్విట్టర్ లో వివరించింది. ఆ వివరాల ప్రకారం... బోస్టన్ లో ఆమె ఉండే సమయంలో (ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉంటోంది) ఒక డేటింగ్ సైట్ లో ఒక వ్యక్తిని కలిసింది. అతని ప్రొఫైల్ నచ్చడంతో అతనితో చాటింగ్ చేసింది. అనంతరం వారి పరిచయం పెరిగింది. ఆ తరువాత ఒక రోజు ఆమె అతనిని డిన్నర్ కు ఆహ్వానించింది. దానికి అతను అంత టైమ్ లేదని ఆమె చెప్పడంతో...పోనీ కాఫీకి రమ్మంది.

దానికి అతను సరే అనడంతో... ఫలానా చోటుకి రమ్మని చెప్పింది. అప్పటికే అతనిపై మనసు పారేసుకున్న ఆ యువతి అతని కోసం కుతూహలంగా ఎదురు చూస్తుండగా... ఒక వ్యక్తి వచ్చి.. వణుకుతున్న గొంతుతో 'నువ్వు ప్రియానా?' అంటూ పలువుర్ని అడగడం వినిపించింది. దీంతో వెళ్లి అతనిని చూసి షాక్ తింది... ఎన్నో ఊహలతో తాను నవయువకుడి కోసం ఎదురు చూస్తుంటే... 97 ఏళ్ల వ్యక్తి తనకు ఎదువడంతో తీవ్ర నిరాశపడింది. పోన్లే కాఫీకే కదా పిలిచాను అని అనుకుని, సరిపెట్టుకుంది. తర్వాత అతనితో కలసి కాఫీ తాగుతూ... అతని వివరాలు అడిగింది.

డేటింగ్ సైట్ లో అతను తన ప్రొఫైల్ కు సంబంధించిన వివరాలను పూర్తిగా ఇవ్వకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగిందని చివరికి ఆమె గ్రహించింది. ఇక తమ సంభాషణలో చివరిగా ఆ ముసలాయన చెప్పిన మాట విని షాక్ తింది. 'డేటింగ్ అంటే ఎంజాయ్ చేయడం అనుకున్నానని, అందుకే తాను అందులో ప్రొఫైల్ పెట్టానని చెప్పడంతో ఆమె కంగు తింది. ఆ తరువాత ఇంటికి వచ్చి, ఆ సైట్ లో ఆయనను బ్లాక్ చేసింది. సోషల్ మీడియా సంబంధాలు ఇలా ఉంటాయని, అందుకే వాటిని పూర్తిగా నమ్మకూడదని నెటిజన్లకు సలహా ఇచ్చింది.

  • Loading...

More Telugu News