: పెళ్లిచూపుల నిమిత్తం తల్లితో కలసి లండన్ వెళ్లిన రణబీర్ కపూర్!
తన కుమారుడు రణబీర్ కపూర్ కు బాలీవుడ్ నటిని భార్యను చేసేందుకు ససేమిరా అంటున్న నీతూ సింగ్ కపూర్, ఓ లండన్ అమ్మాయిని చూసేందుకు కొడుకుతో సహా వెళ్లినట్టు తెలుస్తోంది. మీడియాలో వచ్చిన కథనాల మేరకు లండన్ లోని ఓ వ్యాపార దిగ్గజం కుమార్తెతో పెళ్లిచూపుల నిమిత్తం వీరు వెళ్లినట్టు సమాచారం.
నీతూ దగ్గరి సన్నిహితురాలు ఈ సంబంధాన్ని పరిచయం చేయగా, వీరిద్దరి వివాహం కూడా దాదాపు ఖరారైనట్టేనని వార్తలు వస్తున్నాయి. ఇక గతంలో రణబీర్ కపూర్ తొలుత దీపికా పదుకొనేతో, ఆపై కత్రినా కైఫ్ తో ప్రేమాయణం సాగించినప్పటికీ, అవి పెళ్లి పీటల వరకూ చేరలేదన్న సంగతి తెలిసిందే. ఇక ఈ లండన్ అమ్మాయి అయినా రణబీర్ కు ఫైనల్ అవుతుందో? లేదో? అధికారికంగా తెలియాల్సి వుంది.