: చిరంజీవికి నేను విలన్ ను కాను: రానా


భల్లాలదేవుడి క్యారెక్టర్ తో జాతీయ స్తాయిలో గుర్తింపు పొందిన రానాకు క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. వైవిధ్యభరితమైన పాత్రలు, హిస్టారికల్, పీరియాడిక్ చిత్రాలకు సంబంధించిన పలు ఆఫర్లు రానా తలుపుతడుతున్నాయి. ఈ నేపథ్యంలో. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'లో రానా విలన్ పాత్ర పోషించబోతున్నాడంటూ వార్తలు వినిపించాయి. ఈ వార్తలను రానా ఖండించాడు. ఉయ్యాలవాడకు చెందిన యూనిట్ సభ్యులెవరూ ఇంతవరకు తనను సంప్రదించలేదని ఈ యంగ్ హీరో చెప్పాడు. ఈ వార్తలన్నీ పుకార్లేనంటూ తెలిపాడు. ప్రస్తుతం 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో పాటు మరో పీరియాడిక్ సినిమాలో రానా నటిస్తున్నాడు. 

  • Loading...

More Telugu News