: ఉగ్రవాదుల కర్కశత్వం... చంపేసేముందు భారత జవానుకు చెప్పలేని చిత్రహింసలు!


రాజ్ పుఠానా రైఫిల్స్ కు చెందిన యువ లెఫ్టినెంట్, 22 ఏళ్ల ఉమర్ ఫయాజ్ ను కిడ్నాప్ చేసి, హత్య చేసిన పాకిస్థాన్ ఉగ్రవాదులు, అతన్ని చంపేముందు చెప్పలేని చిత్ర హింసలకు గురి చేసినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. అతన్ని దారుణంగా హింసించారని, తుపాకీ మడమలతో కొట్టారని, పొత్తి కడుపులో, మర్మాంగాలపై పొడిచారని మృతదేహాన్ని పరిశీలించిన అధికారులు వెల్లడించారు.

ఆయన శరీరంలో తుపాకీ తూటాలు కూడా ఉన్నాయని తెలిపారు. సోపియాన్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉమర్ ఫయాజ్ మృతదేహాన్ని కనుగొన్న సంగతి తెలిసిందే. తన కజిన్ పెళ్లి వేడుకలో పాల్గొన్న అతన్ని ముగ్గురు సాయుధులైన పాక్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. కాగా, ఢిల్లీలోని రెజిమెంటల్ సెంటర్ లో ఉమర్ కు శిక్షణ ఇచ్చిన మేజర్ అవదేశ్ చౌదరి మాట్లాడుతూ, తనను తాను నిరూపించుకోవాలని అతను తపన పడుతూ ఉండేవాడని తెలిపారు. అందువల్లే ఉమర్ అంటే తనకెంతో ఇష్టమని, ఏ విషయంలోనైనా దూసుకుపోయే మనస్తత్వం అతనిదని చెప్పారు.

  • Loading...

More Telugu News