: తమ్ముడి మృతదేహాన్ని చూడనే చూడనంటూ విలపించిన నారాయణ కుమార్తె
తన కళ్లముందు ఆడిపాడుతూ పెరిగిన తమ్ముడు ఛిద్రమైన శరీరంతో విగతజీవిగా పడివుంటే, చూడనే చూడలేనంటూ మంత్రి నారాయణ కుమార్తె సిద్దూ విలపిస్తుంటే, అక్కడున్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు. నిషిత్ మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తరలించే ముందు బంధువులు చివరిసారి చూసి నివాళులు అర్పిస్తున్న వేళ జరిగిన ఈ ఘటనతో అక్కడున్న వారి గుండెలు బరువెక్కాయి.
మిగతా వారందరికన్నా సోదరుడితో ఎక్కువ అనుబంధాన్ని పెంచుకున్న ఆమె, ఉదయం నుంచి తండ్రిని అంటిపెట్టుకునే ఉన్నారు. మరో సోదరి సింధూది కూడా అదే పరిస్థితి. ఆపై వారిని ఓదార్చిన బంధువులు నిషిత్ కాళ్లకు మొక్కించి, అక్కడి నుంచి తీసుకువెళ్లారు. ఆపై అంతిమయాత్ర మొదలైంది. పెన్నానది ఒడ్డున నిషిత్ బౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్న సంగతి తెలిసిందే.