: యువకుడి తలను నరికి పోలీస్ స్టేషన్ ముందు విసిరేసిన హంతకులు... సీసీటీవీ ఫుటేజ్ లో ఒళ్లు గగుర్పాటు కలిగించే దృశ్యం


ఓ యువకుడి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయడంతో పాటు, అతని తల నరికి పోలీస్ స్టేషన్ ముందు విసిరేశారు గుర్తు తెలియని హంతకులు. అత్యంత క్రూరమైన ఈ ఘటన తమిళనాడులోని కడలూరులో జరిగింది. ఇద్దరు వ్యక్తులు బైక్ పై స్టేషన్ ముందు వరకూ వచ్చి, యువకుడి తలను విసిరేసి, అక్కడి నుంచి వెళ్లిపోయిన ఒళ్లు గగుర్పాటు కలిగించే దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో నమోదయ్యాయి. ఇటీవల పుదుచ్చేరిలో జరిగిన ఓ హత్యకేసులో 17 ఏళ్ల యువకుడు నిందితుడని భావిస్తూ అతన్ని హత్య చేశారని కడలూరు పోలీసు అధికారి విజయ్ కుమార్ వెల్లడించారు. ఆపై అతని మొండెం సమీపంలోని ఓ చెరువు వద్ద కనిపించిందని తెలిపారు. పుదుచ్చేరిలోనే హత్య జరిగిందని భావిస్తున్నామని విచారణ జరుగుతోందని తెలిపారు.

  • Loading...

More Telugu News