: ఒడిశా 'జూ' లో జన్మించిన పులిపిల్లకు ‘బాహుబలి’.. పేరు!


అవును! బాహుబలే.. భువనేశ్వర్‌లోని నందన్‌కానన్ జూలో పుట్టింది. బాహుబలి ఏంటి.. జూలో పుట్టడం ఏంటి? కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది కదూ! మరేం లేదండి.. నందన్‌కానన్ జూలో బుధవారం ఓ పులి పిల్ల జన్మించింది. దీనికి ఏ పేరు పెట్టాలా.. అని ఆలోచిస్తున్న జూ అధికారులకు సందర్శకులు బ్రహ్మాండమైన పేరు సూచించారు.. అదే బాహుబలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ఆమాట కొస్తే ప్రపంచవ్యాప్తంగా  బాహుబలి-2 రికార్డుల దుమ్ము దులుపుతోంది. దేశ సినీఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేస్తున్న బాహుబలి-2 ప్రదర్శితమవుతున్న సమయంలో పులిపిల్ల పుట్టింది కాబట్టి దానికి బాహుబలి అని నామకరణం చేయాలని సందర్శకులు సూచించారు. దీనికి ఓకే చెప్పిన జూ అధికారులు అదే పేరును ఖాయం చేశారు. రాష్ట్ర అటవీ శాఖామంత్రి  బిజయశ్రీ రౌత్‌రే పులిపిల్లకు నామకరణం తంతు పూర్తి చేశారు. అదండీ.. బాహుబలి జననం కథ!

  • Loading...

More Telugu News