: హైదరాబాదులోని చింతల్ లో దారుణం... గోనెసంచీలో తల, మొండెం
హైదరాబాదులోని చింతల్ లో దారుణం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోని చంద్రానగర్ లోని ఓ ఇంటిని యజమాని ఇద్దరు యువకులకు ఆరు నెలల క్రితం అద్దెకు ఇచ్చాడు. ఓ ప్రైవేటు సంస్థలో పని చేసే ఆ ఇద్దరూ రోజూ విధులకు వెళ్లి వచ్చేవారు. వారం రోజుల నుంచి ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు ఆ ఇంటి యజమానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... రంగప్రవేశం చేసిన పోలీసులు, ఆ ఇంట్లోకి వెళ్లి, సోదా చేయగా, ఒక గోనె సంచిలో తల, మొండెం కనిపించాయి. అవి ఇన్నాళ్లూ ఆ ఇంట్లో అద్దెకు వున్న యువకులలో ఒకరిదే అయివుంటుందని, అనుమానిస్తున్న పోలీసులు పరారైన మరో యువకుడి కోసం గాలింపు చేపట్టారు.