: చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన సురవరం


ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుపై సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా, భారత్ వాణిజ్య మండలి (యూఎస్ఐబీసీ) సదస్సులో చంద్రబాబు ప్రసంగించిన తీరు దారుణంగా ఉందని, అది ఓ థర్డ్ క్లాస్ ప్రసంగమని అన్నారు. ఒక మున్సిపల్ కౌన్సిలర్ కూడా అలా మాట్లాడరని అన్నారు. ఎప్పుడో రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముందని, తన గురించి తాను మాట్లాడుకోవాలిగానీ ఎన్నికల గురించి అక్కడ మాట్లాడటమేంటని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యంగా, వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నానని చంద్రబాబు అనడాన్ని ఆయన తప్పుబట్టారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, తమ అభివృద్ధికి సహకరించండి అని ఏ నాయకుడైనా అడుగుతారని, అందుకు భిన్నంగా, వచ్చే ఎన్నికల్లో ఓడిపోకుండా అన్ని చర్యలు తీసుకున్నానని విజ్ఞత కలిగిన ఏ రాజకీయ నాయకుడు అనరని సురవరం విమర్శించారు.

  • Loading...

More Telugu News