: కాళహస్తిలో జస్టిస్ కర్ణన్?


పశ్చిమ బెంగాల్ పోలీసుల గాలింపు కొనసాగుతోంది. భారత ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులకు ఐదేళ్ల కఠిన శిక్ష విధిస్తూ కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ ప్రకటించడంతో.. సుప్రీంకోర్టు ఆయనకు ఆరు నెలల శిక్ష విధిస్తూ తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించడం తెలిసిందే. అయితే, మద్రాసు గెస్ట్ హౌస్ లో ఉన్న కర్ణన్ దానిని ఖాళీ చేసి, చిత్తూరు జిల్లా కాళహస్తికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ పోలీసులు కాళహస్తికి చేరుకుంటున్నారు. కాగా, మరో పోలీస్ బృందం తడ దగ్గర కాపలా కాస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News