: బాబర్, అక్బర్, ఔరంగజేబులపై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
మొఘల్ చక్రవర్తులు బాబర్, అక్బర్, ఔరంగజేబులపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారంతా మన దేశాన్ని నాశనం చేసి, ఆక్రమించుకోవడానికి వచ్చినవారని అన్నారు. మన దేశ యువత మహారాణా ప్రతాప్ చూపిన మార్గాన్ని అనుసరించాలని... అప్పుడు మన దేశానికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పారు. మహారాణా ప్రతాప్ 477వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమలో యోగి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, గురు గోవింద్ సింగ్ లు మనందరికీ ఆదర్శప్రాయులని అన్నారు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న భారతదేశ ఔన్నత్యాన్ని యువత కాపాడాలని పిలుపునిచ్చారు.