: నిషిత్ కారు వేగంగా నడపడం ఇది నాల్గోసారి!
ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే, అతివేగంగా కారు నడపడం నిషిత్ కు ఇదేమి తొలిసారి కాదని, గతంలో కూడా ఇదే విధంగా కారు నడిపాడని, ట్రాఫిక్ పోలీసులు జరిమానా కూడా విధించారని సమాచారం.
ఈ ఏడాదిలోనే అతివేగంగా కారు నడిపినందుకు నిషిత్ మూడు సార్లు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. తొలిసారి జనవరి 24, 2017న గండిపేట వద్ద 150 కిలోమీటర్ల వేగంతో వెళుతూ ట్రాఫిక్ పోలీసుల స్పీడ్ గన్ కెమెరాలకు చిక్కాడు. ఆ తర్వాత, మార్చి 1న గండిపేట వద్ద అంతే వేగంతో కారు నడుపుతూ మరోసారి, మార్చి 10న మాదాపూర్ ఔటర్ రింగ్ రోడ్ లో అతివేగంగా కారు నడిపుతూ ఇంకోసారి ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడట.