: అపోలో నుంచి నెల్లూరుకు నిషిత్ నారాయణ మృతదేహం తరలింపు


హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ మృతదేహానికి పోస్టు మార్టం పూర్తైంది. అనంతరం అతని మృతదేహాన్ని నెల్లూరు తీసుకెళ్లారు. కాగా, లండన్ నుంచి మంత్రి నారాయణ తన అధికారిక పర్యటన రద్దు చేసుకుని వెనుదిరిగారు. ఆయన రాత్రి 8 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా నెల్లూరుకు రాత్రి 11 గంటలకల్లా చేరుకుంటారు. అనంతరం రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

 మరోపక్క, తన తొలి అధికారిక పర్యటనను రద్దు చేసుకుని, మంత్రి నారా లోకేష్ ఢిల్లీ నుంచి బయల్దేరారు. ఇప్పటికే నెల్లూరులోని నారాయణ నివాసానికి బంధుమిత్రులు, నారాయణ విద్యాలయ సంస్థల సిబ్బంది చేరుకున్నారు. విషణ్ణ వదనాలతో అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్నారు.

  • Loading...

More Telugu News