: అతివేగమే నిషిత్ ప్రాణాలు తీసింది... మద్యం ఆనవాళ్లు లభించలేదు: ఫోరెన్సిక్ వైద్యులు
హైదరాబాదులోని జూబ్లిహిల్స్, రోడ్ నెంబర్ 36లో మెట్రో పిల్లర్ ను బెంజ్ కారు ఢీ కొట్టిన ఘటనలో మృతి చెందిన నిషిత్ నారాయణ, రాజారవివర్మ మృతదేహాలకు అపోలో ఆసుపత్రిలో ఉస్మానియా వైద్యులు పోస్టు మార్టం పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలను వెల్లడించారు. నిషిత్ నారాయణ, రవివర్మ ప్రయాణించిన కారు వేగం వల్లనే ప్రమాదం జరిగి మృతి చెందారని తెలిపారు. మద్యం తాగినట్టు ఆనవాళ్లు లేవని వారు తేల్చారు. ఈ ప్రమాదంలో నిషిత్ ఛాతి, పక్కటెముకలు విరిగాయని వారు తెలిపారు. నిషిత్ డ్రైవింగ్ చేస్తున్నాడని, బలంగా పిల్లర్ ను కారు తాకడంతోనే వారు మృతి చెందారని తేల్చారు. రవివర్మ కంటే నిషిత్ కే ఎక్కవ దెబ్బలు తగిలాయని వారు తెలిపారు.