: నా ప్రాణాలకు ముప్పు ఉంది.. బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి: కపిల్ మిశ్రా


తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆప్ అధినేత కేజ్రీవాల్ పై తిరుగుబాటు చేసిన ఆ పార్టీ నేత కపిల్ మిశ్రా తెలిపారు. చంపుతామంటూ తనకు బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని చెప్పారు. అంతర్జాతీయ నంబర్ల నుంచి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. అయినా తాను భయపడనని, ఎట్టి పరిస్థితుల్లోను వెనకడుగు వేయనని చెప్పారు. కేజ్రీవాల్ రాజీనామాను తాను కోరడం లేదని... విదేశీ పర్యటన ఖర్చు వివరాలను తెలిపితే చాలని అన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా డబ్బులు లేవని కేజ్రీవాల్ చెప్పారని... ఇప్పుడు ఆప్ నేతల విదేశీ పర్యటనలకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని కపిల్ మిశ్రా ప్రశ్నించారు. తాను సత్యాగ్రహాన్ని చేపట్టానని... కానీ, కేజ్రీవాల్ ఇంటి ముందు కూర్చొని ఆయనను ఇబ్బంది పెట్టనని... ఏదో ఒక మూలలో కూర్చొని సత్యాగ్రహాన్ని కొనసాగిస్తానని చెప్పారు.

  • Loading...

More Telugu News