: పాక్ ఎయిర్ లైన్స్ లో మరో షాకింగ్ ఘటన... కాక్ పిట్ లో ప్రయాణికురాలితో ఏకాంతంగా గడిపిన పైలట్!
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ లో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలతో విమాన ప్రయాణికులు షాక్ కు గురవుతున్నారు. ఇటీవలే, పాకిస్తాన్ విమానం ఒకటి టేకాఫ్ కాగానే పైలట్ ప్రయాణికుల ప్రాణాలను గాలికొదిలి.. బిజినెస్ క్లాస్‌లో గుర్రు పెట్టి నిద్రపోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ విషయం ఇంకా సద్దుమణగక ముందే, పీకే-853 విమానం ఇస్లామాబాద్ నుంచి బీజింగ్ వెళ్లేందుకు టేకాఫ్ అయిన కాసేపటికే... కాక్ పిట్ లోని సిబ్బందినంతటినీ బలవంతంగా బయటకు పంపేసిన పైలట్, చైనాకు చెందిన ఒక ప్రయాణికురాలిని కాక్ పిట్ లోకి రప్పించుకున్నాడు. అనంతరం విమానం గాల్లో ఉండగా, వారిద్దరూ ఏకాంతంగా మైకంలోకెళ్లిపోయారు. రెండు గంటల తర్వాత... విమానం ల్యాండ్ అయ్యాక కానీ ఆ ప్రయాణికురాలు కాక్ పిట్ నుంచి బయటకు రాలేదని తెలుస్తోంది. ఎయిర్ లైన్స్ నిబంధనల ప్రకారం కాక్ పిట్ లోపలికి ఎవరూ వెళ్లకూడదు.