: పీకలమీదకు తెచ్చిన ప్రయోగం... వీడియో చూడండి!
పలు రోగాలకు చిట్కా వైద్యాలు చేసుకోవడం మనం చూస్తూనే వుంటాం. అప్పుడప్పుడు ఇవి వికటిస్తూ వుంటాయి కూడా. ఈ సంఘటనలో కూడా అదే జరిగింది. చైనాలో గాంగ్జూ పట్టణంలో ఒక వ్యక్తి మలబద్ధకం పోగొట్టుకోవడానికి దారుణమైన ప్రయోగానికి తెరతీశాడు. మలబద్ధకం వల్ల పలు రోగాలు పట్టుకుంటాయని విన్న ఆ వ్యక్తి... తన మలద్వారం గుండా పొడవుగా ఉండే ఈల్ చేపను పంపించుకున్నాడు. దీంతో పొట్ట ఉబ్బరంగా మారడంతో... ఆ బాధ భరించలేక వైద్యుల వద్దకు వెళ్లాడు. దీంతో అతనిని పరీక్షించిన వైద్యులు షాక్ కు గురయ్యారు. అసాధారణ రీతిలో అతని కడుపులో పొడవైన ఈల్ చేపను గుర్తించారు. దీంతో వెంటనే ఆపరేషన్ చేసి...ఆ చేపను అతని కడుపులోంచి తీసేశారు. అతని కడుపులోంచి ఈల్ చేపను బయటకు తీస్తున్న వీడియో వైరల్ అయింది. దానిని మీరు చూడా చూడండి.