: రణ్ బీర్ పాటకు అమితాబ్ మనవరాలి డ్యాన్స్!


బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందాకు సోషల్ మీడియాలో విశేషమైన స్థాయిలో అభిమానులున్నారు. గతంలో షారూఖ్ కుమారుడితో ఆమె ఫోటోలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నవ్య నవేలీ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తాజాగా ఓ ప్రైవేటు కార్యక్రమంలో నవ్య తన డాన్సుతో అలరించింది. రణ్‌ బీర్‌ కపూర్‌ నటించిన ‘యే జవానీ హే దివానీ’ చిత్రంలో విజయవంతమైన ‘దిల్లీ వాలీ గర్ల్‌ ఫ్రెండ్‌’ పాటకు స్టెప్పులేసి ఆకట్టుకుంది. ఈ డాన్స్ కు సంబంధించిన వీడియోను నవ్య తన ఇన్ స్టాగ్రంలో పోస్టు చేయగా, అది వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వారు నవ్య త్వరలో బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తుందని పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News