: లండన్ పర్యటనలో ఉన్న నారాయణకు షాకింగ్ న్యూస్!
లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేదు వార్త వినాల్సి వచ్చింది. నారాయణ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో డైరెక్టర్ గా గత ఏడాదే బాధ్యతలు చేపట్టిన తనయుడు నిషిత్ నారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించారన్న అత్యంత బాధాకరమైన వార్తను ఆ తండ్రి వినాల్సి వచ్చింది. కారు నెంబర్ టీఎస్ 07 ఎస్కే 7117 ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు... అది మంత్రి నారాయణ కుమారుడికి సంబంధించిన కారు అని తేల్చారు.
కారు వేగంగా వచ్చి మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిందని ఆ పరిసరాల్లో ఉంటున్న వారు తెలిపారు. భారీ శబ్దం రావడంతో తాము నిద్రనుంచి లేచి చూశామని, అత్యంత వేగంతో ఆ కారు మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిందని చెప్పారు. గత రెండు రోజులుగా ఆ కారు తెల్లవారు జాము సమయంలో అతివేగంగా దూసుకురావడం తాము చూశామని అన్నారు.