: ‘ట్రాన్స్ ఫర్మేటివ్ చీఫ్ అడ్మినిస్టర్’ పురస్కారం అందుకున్న సీఎం చంద్రబాబు


అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుకు అరుదైన పురస్కారం లభించింది. ‘ట్రాన్స్ ఫర్మేటివ్ చీఫ్ అడ్మినిస్టర్’ పురస్కారాన్ని చంద్రబాబు అందుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ) రెండో వార్షిక పశ్చిమ తీర సదస్సులో ఈ పురస్కారాన్ని చంద్రబాబు స్వీకరించారు. అనంతరం, వరుస ద్వైపాక్షిక సమావేశాలను చంద్రబాబు నిర్వహించారు. ఏపీని క్లౌడ్ హబ్ గా రూపొందించడంలో సహకరిస్తామని నుటనిక్స్ సంస్థ ముందుకొచ్చింది.

అనంతరం, పట్రా కార్ప్ సీఈవో జాన్ ఎస్ సింప్సన్ తో, వీసా కార్డ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అంబాసిడర్ డెమెట్రియస్ మరంటీస్, బెల్ కర్వ్ ల్యాబ్స్ ప్రతినిధులతో, మొబిలిటీ ఇన్ఫాస్ట్రక్చర్ గ్రూప్ సీఎండీ డాక్టర్ రవీంద్ర వర్మతో ఆయన సమావేశమయ్యారు. ఆ తర్వాత ‘సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పర్మేషనల్ జర్నీ టూ వార్డ్స్ ఏ హ్యాపీ స్టేట్’ అనే ద్వైపాక్షిక సదస్సులో చంద్రబాబు కీలక ఉపన్యాసం చేశారు.  

  • Loading...

More Telugu News