: పవన్ కల్యాణ్ ఎవరో నాకు తెలియదు: అశోక్ గజపతిరాజు


తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఓ ఉత్తరాది వ్యక్తిని టీటీడీ ఈవోగా నియమించడమేంటని పవన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రశ్నించడం విదితమే. తాజాగా, ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని, అతను సినిమా నటుడంటా, సినిమాలు చూసి చాలా కాలమైందని, టీటీడీ ఈవో ఎంపికపై తాను స్పందించనని అన్నారు.

  • Loading...

More Telugu News