: వెంకటేశ్వరస్వామి ఒక ప్రాంతానికో, భాషకో పరిమితం కాదు: మోహన్ బాబు
టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించడం పెద్ద చర్చనే లేవదీసింది. ఉత్తరాది అధికారిని నియమించడం ద్వారా దక్షిణాది ప్రజల మనోభావాలను గాయపరిచారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వారణాసి, మధుర, అమర్ నాథ్ లాంటి పవిత్ర ఆలయాల్లో దక్షిణాది అధికారులను ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించారు.
ఇదే విషయంపై ప్రముఖ నటుడు మోహన్ బాబు తాజాగా స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ శ్రీవేంకటేశ్వరస్వామి దేవుడని... ఒక ప్రాంతానికో, ఒక భాషకో ఆయనను పరిమితం చేయడాన్ని తాను ఖండిస్తున్నానని అన్నారు. తెలుగు భాష రాకపోవడం ఒక్కటే సమస్య కాదని తెలిపారు. సింఘాల్ చాలా సమర్థత కలిగిన అధికారి అని కితాబిచ్చారు.