: మా టీమ్ ప్రదర్శన అసంతృప్తికి గురి చేసింది: డివిలియర్స్


ఐపీఎల్ -10 సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 13 మ్యాచ్ లు ఆడితే, అందులో పది మ్యాచ్ లలో పరాజయం పాలైంది. ఈ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే డివిలియర్స్ దక్షిణాఫ్రికా వెళ్లిపోయాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశాడు. తమ టీమ్ ప్రదర్శన అసంతృప్తికి గురిచేసిందని, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫ్యామిలీతో కొన్ని రోజులు గడిపేందుకు స్వదేశం వెళ్లిపోతున్నానని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. కాగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో గేల్, కోహ్లీ, డివిలియర్స్ వంటి దిగ్గజ బ్యాట్స్ మెన్ ఉన్నప్పటికీ పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News