: ఢిల్లీ అసెంబ్లీలో ఈవీఎంల ట్యాంపరింగ్ పై డెమో.. ఏం జరగబోతోంది?


ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి, ఎన్నికల్లో బీజేపీ గెలుపొందుతోందంటూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాను చేసిన ఆరోపణలను నిరూపించుకునే ప్రయత్నాలను కేజ్రీవాల్ చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచిన ఆయన... ఈవీఎంల పనితీరుపై డెమో ఇప్పిస్తున్నారు. ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఈవీఎంల ట్యాంపరింగ్ ఎలా జరుగుతుందో సభలో వివరిస్తున్నారు. దీనికి ముందు ట్యాంపరింగ్ పై సభలో వాడివేడీ చర్చ జరిగింది. మరోవైపు, ఈ డెమోను తిలకించేందుకు తృణమూల్, జేడీయూ నేతలను కూడా కేజ్రీవాల్ ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News