: బాలీవుడ్ లోకి ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ.. రెడీ అవుతున్న కరణ్ జొహార్


'బాహుబలి' సినిమాలతో ప్రభాస్ జాతీయ స్థాయి హీరోగా ఎదిగాడు. టాలీవుడ్ లో మరే ఇతర హీరోకి రానంత క్రేజ్ దేశవ్యాప్తంగా ప్రభాస్ కు వచ్చింది. సినిమా తొలిభాగం విడుదలైన తర్వాత ప్రభాస్ కు పలు బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. కానీ, రెండో భాగం కోసం ఆ అవకాశాలను ప్రభాస్ వద్దనుకున్నాడు. ఇప్పుడు 'బాహుబలి-2' తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో, ప్రభాస్ తో స్ట్రయిట్ బాలీవుడ్ సినిమాలు చేసేందుకు ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ జొహార్ రెడీ అయిపోయాడు. ప్రభాస్ తో ఒకేసారి రెండు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకోవడానకి ఇప్పటికే చర్చలు మొదలుపెట్టాడు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రభాస్... ఇండియాకు తిరిగిరాగానే ఈ అగ్రిమెంట్ కుదిరే అవకాశం ఉంది. అంతా సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది ప్రభాస్, కరణ్ జొహార్ కాంబినేషన్లో ఈ సినిమాలు పట్టాలకెక్కనున్నాయి. మరోవైపు బాహుబలి సినిమాకు బాలీవుడ్ సమర్పకుడిగా కరణ్ జొహార్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News