: కర్ణన్ ను జైలుకు పంపేందుకు స్వయంగా కదిలిన పశ్చిమ బెంగాల్ డీజీపీ


కోర్టు ధిక్కరణ నేరం కింద కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి చిన్నస్వామి స్వామినాథన్ కర్ణన్ కు ఆరు నెలల జైలు శిక్షను విధిస్తూ, దీన్ని తక్షణమే అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వయంగా కదిలారు. మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న కర్ణన్, సుప్రీం చీఫ్ జస్టిస్ జేఎస్ కేహార్ సహా మరో ఆరుగురు న్యాయమూర్తులపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఐదేళ్ల జైలుశిక్షను విధిస్తున్నట్టు నిన్న సంచలన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు నేడు ఆయనకు జైలు శిక్షను విధిస్తూ తీర్పిచ్చింది.

  • Loading...

More Telugu News