: ఆప్ పేల్చనున్న బాంబులాంటి వార్త ఇదేనా?


"నేడు మధ్యాహ్నం 2 గంటలకు ఓ బాంబులాంటి వార్త చెబుతాం. అందరూ ఖాళీగా ఉండండి" అని ఆప్ ప్రకటన చేసిన తరువాత ఏ విషయంలో ఆప్ మాట్లాడుతుందోనని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. కాగా, ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ లు)లను కేంద్రం ట్యాంపరింగ్ చేసినట్టు పక్కా ఆధారాలు లభించాయని, వాటినే నేటి మధ్యాహ్నం మీడియా ముందుకు తేనున్నామని ఆప్ వర్గాలు ఉప్పందించాయి. అదే నిజమై, ఈవీఎంలను బీజేపీ ట్యాంపర్ చేసినట్టు ఆప్ నిరూపించగలిగితే దేశ రాజకీయాల్లో సునామీ రావడం ఖాయం. ఇక ఈవీఎంలపైనే ఆప్ మాట్లాడనుందా? లేక మరేదైనా విషయం ఉందా? అన్న విషయాలు తెలియాలంటే మధ్యాహ్నం వరకూ ఆగక తప్పదు.

  • Loading...

More Telugu News