: ఫీల్డింగ్ లో గాయపడ్డ యువరాజ్ సింగ్!
యువరాజ్ సింగ్ హైదరాబాదు, ఉప్పల్ స్టేడియంలో గాయపడ్డాడు. టీమిండియాలో సుదీర్ఘ కాలం తరువాత స్థానం సంపాదించిన యువరాజ్ సింగ్ అదే ఉత్సాహంతో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో బరిలోకి దిగాడు. టాస్ ఓడిన సన్ రైజర్స్ ఫీల్డింగ్ చేపట్టగా, ముంబై బ్యాటింగ్ ప్రారంభించింది. తొలివికెట్ వేగంగా కోల్పోవడంతో బరిలోకి దిగిన రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. ఈ మ్యాచ్ లో రాణించిన రోహిత్ శర్మ బలంగా కొట్టిన షాట్ ను యువరాజ్ సింగ్ అడ్డుకున్నాడు. దీంతో వేగంగా దూసుకొచ్చిన బంతి యువీ చేతిని గాయపరిచింది. దీంతో యువీ మైదానం వీడాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగినా కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. అవుటైన అనంతరం చేతిని చూసుకుంటూ యువీ మైదానం వీడాడు. అయితే గాయం పెద్దది కాదని, తరువాతి మ్యాచ్ లకు యువీ అందుబాటులో ఉంటాడని జట్టు మేనేజ్ మెంట్ తెలిపింది.