: తీరు మార్చుకోని అమెజాన్.. జమ్ముకశ్మీర్‌లేని భారత్ చిత్రపటాల విక్రయం


ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తప్పుల మీద తప్పులు చేస్తూ భారత్‌ను అగౌరవపరుస్తూనే ఉంది. ఇదివరకు భారత జెండాలను పోలిన డోర్‌మ్యాట్లను అమ్మకానికి పెట్టిన అమెజాన్ తాజాగా జమ్ముకశ్మీర్‌లో కొన్ని ప్రాంతాలు లేని భారత మ్యాపును ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టింది. దీనిని గుర్తించిన బీజేపీ నేత తేజిందర్ పాల్ ఎస్ బగ్గా సోమవారం ఆ విషయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో భారత మ్యాపుతో ఉన్న డోర్‌మ్యాట్లను అమ్మిన భారత్ ఆగ్రహానికి గురైన అమెజాన్ అప్పట్లో ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. అయినా మరోమారు అటువంటి తప్పే చేసింది. కాగా, తాజా ఘటనపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు.  
 
 
 

  • Loading...

More Telugu News