: ఒకే గ్రామం నుంచి 127 గ్రనేడ్ల వెలికితీత.. 1971 యుద్ధం నాటివని అనుమానం
త్రిపురలోని గౌర్నగర్ అనే గ్రామంలో బయటపడిన గ్రనేడ్లను చూసి పోలీసులు విస్తుపోతున్నారు. గౌరునగర్ చుట్టుపక్కల గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున గ్రనేడ్లు బయటపడుతున్నాయి. ఒక్క గౌరునగర్లోనే 127 గ్రనేడ్లను గుర్తించిన పోలీసులు వాటిని వెలికి తీశారు. ఇవి 1971 యుద్ధ సమయం నాటివి అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గ్రనేడ్లు బయటపడుతుండడంతో ఆయా గ్రామాల్లోని స్థానికులను పోలీసులు అప్రమత్తం చేశారు. ఎవరూ వాటిని ముట్టుకునే సాహసం చేయవద్దని, అవి కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.