: కనికరించిన ఆర్ బిఐ .. రెపో రేటుకు కోత


అందరి కోరికలు, డిమాండ్లను ఆలకిస్తూ.. ఆర్ బిఐ ఎవరినీ నిరాశపరచకుండా వార్షిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించింది. రెపో రేటు(బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్ బిఐ వసూలు చేసే వడ్డీ రేటు)ను 0.25శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నగదు నిల్వల నిష్పత్తిని(బ్యాంకులు ఆర్ బిఐ దగ్గర ఉంచాల్సిన నిధుల శాతం) మాత్రం మార్చలేదు. పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, అదే సమయంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో వడ్డీ రేట్లను తగ్గించాలంటూ పారిశ్రామిక వేత్తలు సహా ప్రభుత్వం నుంచీ వత్తిడి వచ్చింది. ఆర్థిక విశ్లేషకులు, ఎఫ్ఐఐలు అయితే అర శాతం(0.50) రెపో రేటును తగ్గించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్ బిఐ పావు శాతం తగ్గింపుతో సరిపుచ్చింది. ఈ మేరకు బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. దీంతో ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, హసింగ్ తదితర రంగాలకు ప్రయోజనం కలుగుతుంది.

  • Loading...

More Telugu News