: వెంకయ్య నాయుడుకి అరుదైన గౌరవం !
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఐక్య రాజ్య సమితి (యూఎన్ఓ) ఆవాస పాలక మండలి అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. కెన్యా రాజధాని నైరోబీలో జరిగిన 26వ పాలక మండలి సమావేశంలో ఆయన్ని ఎన్నుకున్నారు. కాగా, తనకు ఈ గౌరవం దక్కడంపై వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. యూఎన్ఓ ఆవాస పాలక మండలి అధ్యక్ష పదవి తనకు దక్కడమనేది పట్టణాభివృద్ది రంగం కోసం పనిచేసేందుకు వచ్చిన మరో అవకాశమన్నారు.