: పంజాబ్ 'ఆప్‌' నేతపై దుండగుల కాల్పులు..తప్పిన ప్రమాదం!


ఆమ్ ఆద్మీ పార్టీ నేతపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డ సంఘటన పంజాబ్ లోని గురుదాసు పూర్ లో జరిగింది. అయితే, ఎటువంటి ప్రమాదం జరగకుండా సదరు నేత ప్రాణాలతో బయటపడ్డారు. నిన్న రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేత గురుపర్తాప్ సింగ్ కుషల్పూర్. పంజాబ్ ఎన్నికల్లో ఇటీవల పోటీ చేసి పరాజయం పాలయ్యారు. నిన్న రాత్రి గురుద్వార అనే గ్రామం నుంచి వచ్చిన ఆయన తన ఇంట్లోకి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో, అప్రమత్తమైన ఆయన, వెంటనే, ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News