: లాలూతో తెగతెంపులు చేసుకోండి, అవసరమైతే మా మద్దతు తీసుకోండి: నితీశ్ కు బీజేపీ ఆఫర్
పశువుల దాణా కుంభకోణం కేసులో లాలూకు వ్యతిరేకంగా తీర్చు వచ్చిన నేపథ్యంలో బీహార్ బీజేపీ చీఫ్ సుశీల్ కుమార్ మోదీ తాజాగా స్పందించారు. ఆర్జేడీ అధినేత లాలూతో పొత్తును తెగతెంపులు చేసుకోవాలని, అవసరమైతే తమ పార్టీ మద్దతు తీసుకోవాలని సీఎం నితీశ్ కుమార్ కు సుశీల్ ఆఫర్ ఇచ్చారు. దాణా కేసులో తీర్పు వెలువడిన అనంతరం పాట్నాలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీఎం నితీశ్ కు బహిరంగంగా చెబుతున్నానని, లాలూతో పొత్తును వదిలేసి, ప్రభుత్వం పడిపోకుండా బీజేపీ మద్దతు తీసుకోవాలని కోరారు. గతంలో జేడీయూ, బీజేపీలు మిత్రపక్షాలుగా ఉన్నాయని, లాలూకు వ్యతిరేకంగా చక్రం తిప్పడంలోనూ నితీశ్ కీలక భూమిక పోషించారని సుశీల్ కుమార్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.