: పది లక్షల వాచ్, కేజీ బంగారం, కేజీ వెండి, పెద్దమొత్తంలో బాండ్లు...అవినీతి అధికారి ఆస్తుల చిట్టా


లక్ష రూపాయల నుంచి పది లక్షల రూపాయల విలువ చేసే పది వాచ్ లు, లక్ష రూపాయల విలువ చేసే పెన్నులు, 25 తులాల బరువైన బంగారు నెక్లెస్ లు, వెండి కంచాలు, గిన్నెలు, కట్టలకొద్దీ 2000, 500 నోట్లు, బాండ్లు... ఇలా ఆస్తులను ఎన్ని రకాలుగా దాచుకోవచ్చో అన్నిరకాలుగా సాధారణ పరిపాలన శాఖ విభాగం సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న కరణం వెంకట సాయికుమార్ ఆస్తులు సంపాదించాడు. అక్రమాస్తులపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అవినీతి నిరోధక శాఖాధికారులు ఆయనకు సంబంధించిన పది చోట్ల దాడులు నిర్వహించారు.

హైదరాబాదు, కడప, బెంగళూరు వంటి వివిధ చోట్ల ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులను అధికారులు గుర్తించారు. హైదరాబాదు, కడపల్లో గల పలు ఇళ్లపై నాలుగు టీమ్ లు దాడులు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన నివాసం నుంచి భారీ ఎత్తున అక్రమాస్తులకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. బ్యాంకు లాకర్లతో పాటు బెంగళూరులోని ఇళ్లలో తనిఖీలు నిర్వహించిన తరువాత ఆస్తులపై ఒక అంచనాకు రాగలమని అవినీతి నిరోధక శాఖాధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News