: ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీదే!


కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. ఛైర్మన్ గా టీడీపీ అభ్యర్థి ఆసం రఘురామిరెడ్డి ఎన్నికయ్యారు. ఆసంకు మద్దతుగా 31 మంది కౌన్సిలర్లు ఓటు వేశారు. ఈ ఎన్నికల ప్రక్రియకు వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. ఆసం రఘురామిరెడ్డి మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. ఛైర్మన్ పదవిని కైవసం చేసుకోవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ, వైసీపీ నేతల ఘర్షణ కారణంగా ఛైర్మన్ ఎన్నిక పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.  

  • Loading...

More Telugu News