: క్షమాపణలు కోరిన విరాట్ కోహ్లీ
ఈ ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెత్త ప్రదర్శన చేస్తూ, అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు 12 మ్యాచ్ లు ఆడిన ఈ జట్టు కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. మిగిలిన 10 మ్యాచుల్లో ఓటమిపాలైంది. కోల్ కతా నైట్ రైడర్స్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా 6 వికెట్ల తేడాతో బెంగళూరు ఓడింది. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ, అభిమానులను తాము ఎంతో నిరాశకు గురి చేశామని... వారు ఊహించిన స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నానని ట్వీట్ చేశాడు. తమ వెన్నంటి నిలిచి, అంతులేని ప్రేమ కురిపించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. తమ స్థాయికి తగ్గట్టు ఈ సీజన్ లో ఆడలేకపోయామని చెప్పాడు.