: హైదరాబాదులో కారు బీభత్సం.. ఎస్సై మృతి


హైదరాబాద్ లంగర్ హౌజ్ లో ఈ ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. స్థానిక టిప్పుఖాన్ పూల్ బ్రిడ్స్ పై వాకింగ్ చేస్తున్న వారిపైకి కారు దూసుకుపోయింది. ఈ దారుణ ఘటనలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ కిష్ణయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. తన కళ్ల ముందే వ్యక్తి మృతి చెందినా... కారు డ్రైవర్ మాత్రం కారును రివర్సు చేసుకుని, ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా, ఈ రోజు కిష్ణయ్య పెళ్లిరోజు కావడం అందర్నీ కలచివేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం కిష్ణయ్య మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News