: అమెరికాలో తెలుగు విద్యార్థులుండే అపార్ట్ మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం
అమెరికాలోని లూజియానాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెలుగు విద్యార్థులు భారీ సంఖ్యలో ఉండే ప్రాంతం, అపార్ట్ మెంట్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో తెలుగు విద్యార్థులకు చెందిన పాస్ పోర్టులు, వీసా డాక్యుమెంట్లతోపాటు మరిన్ని విలువైన వస్తువులు తగులబడిపోయాయని తెలుస్తోంది. ఉన్నత విద్యనభ్యసించేందుకు చేరిన తెలుగువారు ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటారని తెలుస్తోంది. కాగా, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. దీనికి కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.