: 300 మంది ప్రయాణికుల ప్రాణాలను గాల్లో ఉంచి... గాఢంగా నిద్రపోయిన పాక్ ఎయిర్ లైన్స్ పైలట్!


300 మంది ప్రయాణికుల ప్రాణాలను ట్రైనీకి అప్పగించి, రెండున్నర గంటలు హాయిగా కునుకు తీసిన పైలట్ సంగతి తెలియడంతో అతని ఉద్యోగం ఊడింది. వివరాల్లోకి వెళ్తే... పాకిస్థాన్ కు చెందిన పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ లైన్స్‌ (పీఐఏ) పీకే–785 విమానం 305 మంది ప్రయాణికులతో ఏప్రిల్‌ 26న ఇస్లామాబాద్‌ నుంచి లండన్‌ కు బయల్దేరింది. ఇందులో 293 మంది ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులుండగా, 12 మంది బిజినెస్‌ క్లాస్‌ ప్రయాణికులున్నారు.

ట్రైనీ పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు పాకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పని చేసిన కెప్టెన్‌ అమిర్‌ అక్తర్‌ హష్మీని ఈ విమానంలో పంపించింది. ఇందుకుగాను ఆయనకు నెలకు లక్ష రూపాయల వేతనం చెల్లిస్తోంది. లండన్‌ కు విమానం బయల్దేరిన కాసేపటికే శిక్షణలో ఉన్న ట్రైనీ పైలట్‌ అసద్‌ అలీకి విమానాన్ని అప్పగించి, సుమారు రెండున్నర గంటలపాటు బిజినెస్‌ క్లాస్‌ లో హాయిగా నిద్రపోయాడు సదరు పైలట్. దీనిని వీడియో తీసిన ఒక ప్రయాణికుడు సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఘటనపై పీఐఏ అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన అధికారులు ఆయనను విధుల నుంచి తొలగించారు.

  • Loading...

More Telugu News