: ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడిగా మాక్రాన్ ఎన్నిక
ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ ఘన విజయం సాధించారు. ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో 65.1 శాతం ఓట్లు సాధించిన మేక్రాన్ ప్రత్యర్థి లి పెన్ (34.9 శాతం ఓట్లు) పై అద్భుత విజయం సాధించారు. తొలి విడత ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన మేక్రాన్ రెండోవిడత కూడా ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన మేక్రాన్...ఆ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా రికార్డు పుటలకెక్కనున్నారు.
యూరోపియన్ యూనియన్ కు అనుకూలంగా వ్యవహరించే ఆయన ఎన్ మార్చ్ అనే రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించడం ద్వారా... కార్మిక చట్టాలను సరళీకరించడం, వెనుకబడిన ప్రాంతాల్లో విద్యా సౌకర్యాలను పెంచడం, స్వయం ఉపాధి పొందుతున్న వారికి రక్షణ కల్పించడం వంటి నినాదాలు, భరోసాతో ఎన్నికల్లో విజయం సాధించారు.