: అవును... నారా లోకేష్ కు చెమ్చాగిరి చేస్తున్నాను: దేవినేని అవినాష్


విజయవాడ టీడీపీ నేత దేవినేని అవినాష్ ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీ యువ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ కు చెమ్చాగిరి చేస్తున్నారా?’ అని ప్రశ్నించగా, ‘తప్పకుండా, చేస్తున్నాను. చంద్రబాబునాయుడు గారి తర్వాత మా నాయకుడు నారా లోకేష్ గారే. నారా లోకేష్ ను దగ్గర ఉండి చూసిన వ్యక్తిని, ఆయనకు ఉన్న విజన్, ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి గానీ, మరెవ్వరికీ లేదు. రాష్ట్రాన్ని, ఈ పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రతి కార్యకర్తకు ఏ విధంగా అండగా ఉండాలనే లక్ష్యం ఉన్న నాయకుడికి మేము తోడుగా ఉంటాం, అలాంటి నాయకుడికి చెంచా గిరి చేస్తాం. ఆయనతో ఉంటాం, పోరాటం చేస్తాం, చెప్పింది చేస్తాం’ అని దేవినేని అవినాష్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News