: రామేశ్వరం తీరానికి కొట్టుకొచ్చిన 800 కిలోల చుక్కల సొరచేప
రామేశ్వరం తీర ప్రాంతానికి డాటెడ్ వేల్ షార్క్ (చుక్కల సొరచేప) కొట్టుకువచ్చింది. పాంబర్ సముద్ర తీర ప్రాంత సమీపంలోకి సుమారు 800 కిలోల బరువు ఉన్న డాటెడ్ వేల్ షార్క్ ఒకటి కొట్టుకువచ్చింది. అయితే, స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అధికారులు అది చనిపోయినట్టు గుర్తించారు. షార్క్ మృతికి గల కారణాలు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత చెబుతామని అధికారులు పేర్కొన్నారు.