: ‘వాట్సప్’లో ఓ యువకుడి మెస్సెజ్ .. ఉట్నూరులో ఇరువర్గాల ఘర్షణ!


ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సామాజిక మాధ్యమం వాట్సప్ లో ఓ వర్గాన్నికించపరుస్తూ ఓ యువకుడు పెట్టిన పోస్టింగ్ కారణంగా వివాదం తలెత్తింది. తమ వర్గాన్ని కించపరిచిన సదరు యువకుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ, పాలనాధికారి వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఎటువంటి ఫలితం లేకుండాపోయింది. దీంతో, ఆందోళనకారులపై లాఠీచార్జి చేసి, టియర్ గ్యాప్ ప్రయోగించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్టు డీఐజీ రవివర్మ తెలిపారు. రాళ్లు రువ్విన వారిని అదుపులోకి తీసుకున్నామని, అవసరం ఉన్నంత వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News